ముగించు

వ్యవసాయ శాఖ

పాత్ర మరియు డిపార్ట్మెంట్ యొక్క పనితనం:

మా దూర దృష్టి

వ్యవసాయాన్ని లాభసాటిగా అంతర్జాతీయ పోటీని తట్టుకునేట్లుగా చేసి,ఆంద్రప్రదేశ్ రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలన్నదే మా ఆశయం.

మా సంకల్పం
  • ఎక్కువ గిరాకీ ఉన్న సేవలను రైతులకు అందించి, ప్రకృతి సమతుల్యతకు నష్టం కలగకుండా వ్యవసాయాన్ని    జీవనోపాధి  నుంచి  వ్యాపారాత్మకంగా చేసుకునేందుకు చేయూత నిచ్చి తద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేయడం.
  • విభిన్న పంటలను ప్రోత్సహించడం, ఉత్పత్తులకు విలువ చేకూర్చడం మరియు కావలసిన మార్కెట్ సదుపాయాలను కల్పించడం ద్వారా అంతర్జాతీయ పోటీని తట్టుకునే లాభసాటి సుస్థిర వ్యవసాయాన్ని రూపొందించడం.
మా ఉద్దేశ్యాలు
  • సమర్దవంతమైన సాంకేతిక బదిలీ మరియు రైతులచే దానిని అవలంబింప చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో పంటల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను అధికం చేసి వ్యవసాయం లో 5 శాతం మరియు అంతకంటే ఎక్కువ వృద్ధిరేటును సాధించడం.
  • జీవ పద్ధతుల ద్వారా ఉత్పత్తి ఖర్చు తగ్గించి , రైతుల వ్యవసాయ రాబడిని పెంచి , భూమి మరియు జలవనరులను సుస్థిరంగా వాడుకునేందుకు రైతులను సమర్దులుగా చేయడం.
  • విస్తరణ శాఖ సిబ్బంది యొక్క పనితీరును సమీక్షించి, మెరుగుపరచడం ద్వారా  రైతులకు ఫలప్రదమైన సేవలు అందించి మరియు సేవల ధర ఆమోదయోగ్యంగా ఉండేలా చేయడం.
  • యాంత్రిక వ్యవసాయాన్ని మరియు సమాచార మరియు ప్రసార పరిజ్ఞాన(ఐ.సి.టి) వాడకాన్ని వ్యవసాయంలో ప్రోత్సహించండం.
  • వ్యవసాయరంగ అభివృద్ది లో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనేందుకు కావలసిన ప్రణాళికలను , సూచనలను తయారు చేసేందుకుగాను వ్యవసాయ శాఖకు కావలసిన నిర్దిష్టమైన విధి విధానాన్ని రూపొందించి దిశానిర్దేశాకాలను నిర్ణయించడం.
మా వ్యూహం
  • విస్తరణశాఖ సిబ్బందిని సమర్దవంతలుగా చేయడం (నాలెడ్జి అప్ డేట్)
  • వర్క్ షాప్స్ / సేమినార్స్ (నాలెడ్జి అగ్రిగేషన్-విషయ పరిజ్ఞాన క్రోడీకరణ )
  • రీజినల్ కాన్ఫరెన్స్ (ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ప్రాంతీయ సమగ్ర మార్గం)
  • రైతులను సంగ్రవంతులుగా చేయడం (ఆర్ సి వై-ఫ్రీ సీజనాల్ టెక్నాలజి డిస్సెమినేషన్)
  • రైతు సదస్సులు (ఫార్మర్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్స్)
  • మోటివేషన్ ఎంకరేజిమెంటు(అవార్డ్స్)
  • రైతుల అవగాహనా సందర్శనలు
  • ప్రదర్శనలు
  • పరిశోధన విస్తరణ సమన్వయం
  • బులెటిన్స్/బ్రోచర్స్/పోస్టర్స్
  • ఇంటర్నెట్ /విసిడిలు/టెలికాస్టు/బ్రాడ్ కాస్టు/కాల్ సెంటరు
  • రైతుమిత్ర గ్రూపుల ఏర్పాటు
  • జెండర్ బ్యాలెన్సు ఇన్ అగ్రికల్చరు
  • సూక్ష్మప్రణాళిక (వ్యవసాయ పరిస్థితుల మార్గం)
  • వివిద శాఖలను అనుసంధానించి ధృఢపరచడం
  • అగ్రిటెక్నాలజి మిషన్ ను ఏర్పరచడం
  • క్రాప్ రిసోర్స్ గ్రూప్స్(సి.ఆర్జి”లు)
  • ప్రపంచ వాణిజ్య సంస్థ విభాగం
  • మా సేవలు
  • ఎన్ షూరింగు క్వాలిటి టైమ్ లీ ఇన్ పుట్
  • సప్లైఇన్ పుట్ రేగ్యులేషను
  • భూసార పరీక్షలు
  • ఎరువుల పరీక్షలు
  • పురుగు మందుల పరీక్షలు
  • విత్తన పరీక్షలు
  • భూ వినియోగ గణాంకాల తయారి
  • ఋణ ఏర్పాట్లు
  • పంటల భీమా ఏర్పాట్లు

పథకాలు / చర్యలు / చర్యల ప్రణాళిక:

మా కార్యక్రమాలు
  • పొలంబడి – ఫార్మర్స్ ఫీల్డు స్కూల్సు(ICM-INM,IPM,WM,etc).
  • విత్తన గ్రామం
  • వానపాముల ఎరువు
  • శ్రీ’ వరి పద్ధతి
  • వ్యవసాయ యాంత్రీకరణ.
  • సేంద్రీయ వ్యవసాయం
  • సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించడం
  • జీవ ఎరువులను ప్రోత్సహించడం
  • సేంద్రీయ పురుగు మందులను ప్రోత్సహించడం
  • జీవన సంబంధిత పురుగు మందులను ప్రోత్సహించడం
  • పచ్చిరొట్ట ఎరువులను ప్రోత్సహించడం
  • ప్రకృతి వైపరీత్యాల యాజమాన్యం
  • సమస్యాత్మక భూముల యాజమాన్యం
  • వాటరు షెడ్ల డెవలప్మెంటు
  • ఆప్టిమల్ క్రాపు ప్లానింగు(క్రాపు డైవర్సిఫికేషను)
  • మహిళల సాదికారతను పెంచడం
  • ఎ.టి.యం.ఎ(ATMA)విస్తరణ పధకాల అమలు
భూసార పరీక్షలు:

ఈ పధకం అమలులో కృష్ణా జిల్లా మొదటి స్థానం లో ఉన్నది.జిల్లాలో ఉన్న రైతులందరికి సాయిల్ హెల్త్ కార్డులు ఇప్పటికే రైతులకు అదించడంజరిగినది 7.8)4లక్షలు( 2019-20 సంవత్సరంలో మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసుకుని పైలట్ పధకం క్రింద గ్రామంలోని రైతులందరూ లబ్ది పొందేలా (50గ్రామాలలో) 18957 మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు ఇప్పుడు అందించబడుచున్నవి. ఈ గ్రామాలలో 100 హె.లలోని రైతులకు భూసార పరీక్షలననుసరించి సూక్ష్మ పోషకాలు 100 % సబ్సిడీపై అందించబడుచున్నవి. రైతులు భూసార పరీక్షలననుసరించి ఎరువులు వాడుతున్నందున రసాయనిక ఎరువుల వాడకం తగ్గడమే కాక, సాగు ఖర్చులు తగ్గి రైతులు లబ్ది పొందుచున్నారు.

100 శాతం సబ్సిడీ పై సూక్ష్మ పోషక ఎరువుల సరఫరా:

2018-19 సంవత్సరంలో 2384 మెట్రిక్. టన్నులు వివిధ సూక్ష్మ పోషకాలు (జింక్, జిప్సం, బోరాన్) రూ. 3.77 కోట్లు సబ్సిడీ తో ఇవ్వబడినది. 2019-20 సంవత్సరంలో 2500 మెట్రిక్ టన్నులు రూ 4.00 కోట్లు సబ్సిడీ తో రైతులకు అందించడానికి లక్ష్యముగా నిర్ణయించబడినది. సూక్ష్మ పోషకాలు వాడటంవలన లోపాలు సవరించబడి ,దిగుబడులు పెరిగి రైతులు అధిక ఆదాయం పొందగలుగుతున్నారు.
2018-19 సంవత్సరంలో 13942 క్వింటాళ్ళు పచ్చిరొట్టపైరు విత్తనాలు 75% సబ్సిడీ పై రూ 5.45 కోట్లు విలువతో ఇవ్వగా 2019-20 సంవత్సరంలో 14500 క్వింటాళ్ళు 6.03 కోట్లు విలువతో రైతులకు అందిచబడుచున్నవి పచ్చిరొట్ట పైరులు ప్రోత్సహించడం వలన భూములు సారవంతమై అధిక దిగుబడులు సాధించడమే కాక రసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించగలుగుతున్నారు.
ఖరీఫ్ 2018 లో 8928 క్వింటాళ్ళు వివిధ పంటల విత్తనాలు (వరి, మినుము మొదలైనవి) రూ 48.10 లక్షలు సబ్సిడీ తో ఇవ్వబడగా ఈ సంవత్సరం 9500 క్వింటాళ్ళు రూ 56.00 లక్షలు సబ్సిడీతో అందించబడుచున్నవి. రైతులు వారి పొలాలలోనే నాణ్యమైన విత్తనాన్ని అభివృద్ధి చేసుకునేలా వారికి మేలైన విత్తనాన్ని (ఫౌండేషన్ సీడ్) 50 శాతం సబ్సిడీతో అందించి విత్తనోత్పత్తిలో మెళుకువలపై శిక్షణ ఇవ్వబడుచున్నది. ఈ గ్రామీణ విత్తనోత్పత్తి పధకం జిల్లాలో 530 హె..లు వరి పంటలో అమలుచేయబడుచున్నది.

పొలం పిలుస్తోంది:

గ్రామలలోని రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞనాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెచ్చేందుకు వ్యవసాయ మరియు అనుబంధశాఖల అధికారులు వారంలో రెండు రోజులు (మంగళ, బుధవారములు) గ్రామాలను సందర్శించి రైతులకు గ్రామసభలు నిర్వహించి కావలసిన సూచనలు అందించెదరు . పొలం పిలుస్తోందిలో పాల్గొవడం ద్వారా రైతులు వ్యవసాయ మరియు అనుబంధ శాఖల కార్యక్రమాలపై అవగాహన పెరిగి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడానికి కావలసిన చర్యలు సకాలంలో తీసుకొనగలుగుతున్నారు.

పోలంబడి :

ఎంపిక చేసిన గ్రామాలలో యూనిట్ 10 హె..లు చొప్పున 30 మంది రైతులకు వివిధ పంటల సాగుపై పూర్తి అవగాహన, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికి పాటించవలసిన మెళకువలు, విచక్షీణా రహితంగా వాడుతున్న ఎరువులు, పురుగు మందుల ను తగ్గించుకుని నాణ్యమైన ఉత్పత్తులను పండించడానికి, రైతులను సుశిక్షుతులను చేయడానికి వివిధ పంటలలో సార్వా పంటకాలంలో 18 పొలం బడులు నిర్వహించబడుచున్నవి.

వ్యవసాయ యంత్రీకరణ:

ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) విధానాన్ని అమలు చేయడంలో కృష్ణ జిల్లా మొదటి స్థానం లో ఉన్నది. 2018-19 సంవత్సరంలో రూ.25.75 కోట్లు సబ్సిడీ తో రైతులకు కావలసిన ట్రాక్టర్,రోటవేటర్లు,కల్టీవేటర్ మొదలైనవి సబ్సిడీ తో అందించడం జరిగినవి. 2019-20 సంవత్సరంలో రూ.35.00 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణ పధకం క్రింద కేటాయింపు కొరకు ప్రతిపాదనలు పంపడమైనది. వ్యవసాయ యంత్రీకరణ వలన కూలీల పై ఖర్చు తగ్గించుకుని వ్యవసాయ కార్యక్రమాలు సకాలంలో చేపట్టి అధిక దిగుబడులు పొందగలుగుతున్నారు.

పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం:

సాగు ఖర్చులు తగ్గించి , వ్యవసాయంలో సంక్షోభాన్ని నివారించి, ప్రతికూల వాతావరణ మార్పుల నుండి రైతులను రక్షించి వారి సమగ్రాభివృద్దికి తోడ్పడేలా  కృష్ణాజిల్లాలో అన్నీ మండలాలలోపెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతున్నది. 2018 సంవత్సరం వరకు 25000 హె..లలో ప్రకృతి సేద్యం ఆచరించబడగా ఈ సంవత్సరం అదనంగా 10000 హె..లలో ప్రకృతి వ్యవసాయం చేపట్టడానికి ప్రణాళిక రూపొందించబడినది.

ఐ.టి(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మాధ్యమాలు:

రైతులకు సకాలంలో సమాచారాన్ని చేరవేయడానికి, విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందించడానికి ప్రభుత్వ పధకాలు పారదర్శకంగా అమలు చేయడానికి వ్యవసాయ శాఖ డి-క్రిషి, ఆధార్ అనుసంధానంతో ఎరువులు విత్తనాల అమ్మకాలు, ఈ –పంట, రైతుసేవ యాప్ మొదలైనవి అమలు చేయుచున్నది.

వై. యస్.ఆర్ రైతుభరోసా:
    • ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.50 వేలు ఇవ్వటం జరుగుతుంది. పంటవేసే సమయానికి మే నెలలో రూ.12,500 చొప్పున ఇవ్వటం
      జరుగుతుంది.
    • పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పనిలేదు. రైతన్న చెల్లించాల్సిన బిమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
    • రైతన్నలకి వడ్డీలేని పంట రుణాలు, రైతులకు ఉచితంగా బోర్లు వేయించబడటం, వ్యవసాయానికి పగటిపూటే 9 గం. ఉచిత కరెంట్, ఆక్వారైతులకు
      కరెంట్ ఛార్జీలు యూనిట్ కు రూ. 1.50 కే ఇవ్వబడును.
    • రూ. 3 వేలు కోట్లతో “ధరల స్థిరీకరణ నిధి” ఏర్పాటు, పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటించి. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇవ్వడం
      జరుగుతుంది.
    • రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు.
    • ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజక వర్గంలో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ ఏర్పాటు.
    • మొదటి ఏడాది సహకార రంగం పునరుద్దరణ, రెండవ ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్ కు రూ. 4 బోనస్.
    • వ్యవసాయ ట్రాక్టర్ కు రోడ్ టాక్స్ రద్దు, టోల్ టాక్స్ రద్దు.
    • ప్రమాదవశాత్తూ లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబానికి వై. యస్.ఆర్ బీమా ద్వారా రూ. 7 లక్షలు ఇవ్వబడును . అంతే కాదు
      డబ్బును అప్పులవాళ్ళకు చెందకుండా అసెంబ్లీలో చట్టాని తీసుకువచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉండటం.
పంట రుణాలు:

రైతులకు పంట రుణాలు అందించడంలో 2018-19 సంవత్సరంలో కృష్ణా జిల్లా రూ 11728 కోట్లు లక్ష్యానికి గాను రూ 12600 కోట్లు మంజూరు చేసి మొదటి స్థానంలో ఉన్నది. 2019-20 వార్షిక లక్ష్యం రూ 13169 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ 2200 కోట్లు రైతులకు అందించడం జరిగినది.

కౌలు రైతులకు వ్యవసాయ ఋణాలు:

భారతదేశం లో మొదటిసారిగా మన రాష్ట్రం లో కౌలు రైతులకు COC మరియు LEC కార్డులు జారీ చేసీ వారికి బ్యాంకుల ద్వారా పంట ఋణాలు పొందే సౌకర్యం కల్పించడం జరిగినది.కౌలు రైతులతో రైతు మిత్ర (గూపులు , జాయింట్ లయబిలిటీ (గూపుల ఏర్పాటు చేసి బ్యాంకులతో సంప్రదించి వారికి ఋణాలు అందేలా చర్యలు తీసుకొనబడుచునవి. 2018-19 సంవత్సరంలో 850 కోట్లు కౌలు రైతులకు ఋణ సౌకర్యం కల్పించబడగ 2019-20 సంవత్సరంలో రూ.900.00 కోట్లు ఇచ్చుటకు లక్ష్యంగా నిర్ణయించడమైనది. 2019-20 సంవత్సరంలో 44557 LEC కార్డులు లక్ష్యంకాగా ఇప్పటివరకు 60229 LEC కార్డులు (135 % ) కౌలు రైతులకు ఇవ్వడమైనది. అలాగే 70000 COC లక్ష్యంకాగా ఇప్పటివరకు 78027 COC కార్డులు (111%) కౌలు రైతులకు ఇవ్వడమైనది(రాష్ట్రం లో ప్రధమ స్థానం). 2019-20 సంవత్సరంలో కౌలు రైతులకు ఇప్పటివరకు రూ. 50.00 కోట్లు పంట ఋణాలు మంజూరుచేయడమైయనది.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY):

ఈ పంటల బీమా పధకము కృష్ణా జిల్లాలో ఖరీఫ్ 2016 సంవత్సరం నుండి అమలులో ఉన్నది. ప్రీమియం కట్టుటకు వరి పంటకు ది. 21.08.2019 ఆఖరు తేది మరియు ఇతర పంటలకు ది. 31.07.2019 ఆఖరు తేది. ఈ పంటల బీమా పధకంలో చేరడం వలన ఏదైనా (పకృతి వైపరీత్యముల వలన రైతులు పంటలను కోల్పోయినప్పుడు బీమా కంపెనీ వారి నుండి క్లైము పొందవచ్చును .జిల్లాలో ఖరీఫ్ లో సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న, పెసర, కంది, మిరప, ప్రత్తి వేరుశెనగ, చెరకు పంటల రైతులు కేవలం ఒక రూపాయి మాత్రమే చెల్లించి ఈ పంటల బీమా పధకం క్రింద చేరవచ్చును. కృష్ణా జిల్లాలో 2016 నుండి 2018 వరకు పంటల బీమా పధకం క్రింద రూ. 25.91 కోట్లు క్లైము చెల్లించడమైనది. అలాగే గత సంవత్సరం ఫెథాయి తుఫాను వలన కోత అనంతరం వరి పంట నష్ట పోయిన 12130 రైతులకు రూ.21.65 కోట్లు నష్ట పరిహారం బీమా కంపనీ వారిచే చెల్లించబడినది

సంస్థాగత నిర్మాణ క్రమము:

Organogram

సంప్రదించవలసిన వివరాలు:
S.No Designation/Place of working ఫోన్ నెం.
1 జిల్లా వ్యవసాయ అధికారి, కృష్ణా జిల్లా 8331056857
2 వ్యవసాయ సహాయ  సంచాలకులు,O/o జిల్లా వ్యవసాయ అధికారి,కృష్ణా జిల్లా 8331056862
3 వ్యవసాయ సహాయ  సంచాలకులు,మచిలీపట్నం 8331056870
4 వ్యవసాయ సహాయ సంచాలకులు, బంటుమిల్లి 8331056871
5 వ్యవసాయ సహాయ  సంచాలకులు, అవనిగడ్డ 8331056872
6 వ్యవసాయ సహాయ  సంచాలకులు, మొవ్వ 8331056873
7 వ్యవసాయ సహాయ  సంచాలకులు, గుడివాడ 8331056874
8 వ్యవసాయ సహాయ  సంచాలకులు, పామర్రు 8331056875
9 వ్యవసాయ సహాయ  సంచాలకులు, విజయవాడ 8331056879
10 వ్యవసాయ సహాయ సంచాలకులు, నూజివీడు 8331056885
11 వ్యవసాయ సహాయ  సంచాలకులు, గన్నవరం 8331056887
12 వ్యవసాయ సహాయ  సంచాలకులు, SSF, ఘంటసాల 8331056894
13 మండల వ్యవసాయాధికారి, మచిలీపట్నం 8331056805
14 మండల వ్యవసాయ అధికారి,పెడన 8331056806
15 మండల వ్యవసాయ అధికారి, గూడూరు 8331056807
16 మండల వ్యవసాయ అధికారి,బంటుమిల్లి 8331056808
17 మండల వ్యవసాయ అధికారి,కృత్తివెన్ను 8331056809
18 మండల వ్యవసాయ అధికారి,అవనిగడ్డ 8331056810
19 మండల వ్యవసాయ అధికారి,మోపిదేవి 8331056811
20 మండల వ్యవసాయ అధికారి,కోడూరు 8331056812
21 మండల వ్యవసాయ అధికారి,నాగాయలంక 8331056813
22 మండల వ్యవసాయ అధికారి,చల్లపల్లి 8331056815
23 మండల వ్యవసాయ అధికారి, ఘంటసాల 8331056816
24 మండల వ్యవసాయ అధికారి,మొవ్వ 8331056814
25 మండల వ్యవసాయ అధికారి,గుడివాడ 8331056817
26 మండల వ్యవసాయ అధికారి,నందివాడ 8331056819
27 మండల వ్యవసాయ అధికారి,పెదపారుపూడి 8331056818
28 మండల వ్యవసాయ అధికారి,పామర్రు 8331056820
29 మండల వ్యవసాయ అధికారి,గుడ్లవల్లేరు 8331056821
30 మండల వ్యవసాయ అధికారి,పెనమలూరు 8331056828
31 మండల వ్యవసాయ అధికారి,కంకిపాడు 8331056829
32 మండల వ్యవసాయ అధికారి,తోట్లవల్లూరు 8331056830
33 మండల వ్యవసాయ అధికారి,బాపులపాడు 8331056845
34 మండల వ్యవసాయ అధికారి,గన్నవరం 8331056846
35 మండల వ్యవసాయ అధికారి,ఉంగుటూరు 8331056847
36 మండల వ్యవసాయ అధికారి,ఉయ్యూరు 8331056848
37 మండల వ్యవసాయ అధికారి,పమిడిముక్కల 8331056849
38 వ్యవసాయ అధికారి(QCI), O/o DAO, మచిలీపట్నం 8331056865
39 వ్యవసాయ అధికారి (Tech-1), O/o DAO, మచిలీపట్నం 8331056867
40 వ్యవసాయ అధికారి, AMC STL, మచిలీపట్నం 8331056797
41 వ్యవసాయ అధికారి, AMC STL,గుడివాడ 8331056798
42 వ్యవసాయ అధికారి, (Technical), O/o ADA, మచిలీపట్నం 8331056775
43 వ్యవసాయ అధికారి, (Technical), O/o ADA,గుడివాడ 8331056781
44 వ్యవసాయ అధికారి, (Technical), O/o ADA, SSF, ఘంటసాల 8331056895
45 వ్యవసాయ అధికారి, (Technical), O/o DTC, మచిలీపట్నం 8331056772
46 వ్యవసాయ సహాయ  సంచాలకులు, (Technical), O/o DTC, మచిలీపట్నం 8331056766
47 వ్యవసాయ సహాయ  సంచాలకులు, (Technical), O/o DTC, మచిలీపట్నం 8331056771

ఇమెయిల్ :-

agrikri[at]nic[dot]in:jda[dash]ap[dot]nic[dot].in

ముఖ్యమైన లింకులు:

http://www.apagrisnet.gov.in/

http://jdakrishna.blogspot.com/