జిల్లా నీటి యాజమాన్య సంస్థ

అ) పార్శ్వ వివరణ

శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ:

జిల్లా నీటి యాజమాన్య సంస్థ (ద్వామా) ప్రత్యెక ప్రాతిపత్తి గల సంస్థగా 2011 సం||లొ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నుండి వేరు చేయబడినది. వాటర్ షెడ్ ఆధారంగా మానవ , సహజ వనరుల అభివృద్ధిని పర్యవేక్షించుట దీని ముఖ్య ఉద్దేశ్యo.

ఈ ప్రాజెక్ట్ అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్ మరియు పథక సంచాలకులు ఈ సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు.

మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కృష్ణా జిల్లాలోగల 49 మండలాల్లో జీవనోపాధి భద్రతను పెంపొందించుటకై , ప్రతీ కుటుంబానికి ఒక ఆర్ధిక సంవత్సరంలో 100 రోజుల ఉపాధిని కల్పిస్తున్నది. కుటుంబంలో ఎవరైతే వయోజనుడై , నైపుణ్యం లేని వారై, శారీరక శ్రమ పడటానికి సిద్దులై ఉంటారో వారికి ఈ పథకం ఉద్దేశ్యించబడినది .

ఈ పథకం యొక్క మరొక ఉద్దేశ్యం రహదారులు, కాలువలు , చెరువులు వంటి దీర్ఘకాలిక స్తిరాస్తులను నిర్మింపచేయడం. ఇంకా సాగునీరు, కరువు నివారణ మరియు వరద నిరోధం వంటివాటికి కూడా ప్రాథాన్యత కల్పించబడినది.

అమలు చేసే సంస్థలు:

ఈ పథకాన్ని అమలు చేయు సంస్థలు 1005 గ్రామాల్లో ఉన్నాయి.